25 వ తేదీ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసిన తెలంగాణ... 

25 వ తేదీ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసిన తెలంగాణ... 

జులై 25 వ తేదీన రిలీజ్ చేయాల్సిన హెల్త్ బులెటిన్ ను తెలంగాణ ఆరోగ్యశాఖ ఈరోజు రిలీజ్ చేసింది.  బులెటిన్ లో మార్పులు చేస్తున్నట్టు నిన్నటి రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే.  తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, హాస్పిటల్ వివరాలు, ఐసోలేషన్ కేంద్రాలు తదితర సమగ్ర వివరాలతో కూడిన 18 పేజీల హెల్త్ బులెటిన్ ను ఈరోజు రిలీజ్ చేసింది.  

ఇక హెల్త్ బులెటిన్ ప్రకారం 25 వ తేదీన తెలంగాణలో 1593 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,059 కి చేరింది.  ఇందులో 12264 కేసులు యాక్టివ్ గా ఉంటె, 41,332 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  25 వ తేదీన తెలంగాణలో 8 మంది కరోనాతో మరణించారు.  దీంతో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 463కి చేరింది.  జీహెచ్ఎంసిలో అత్యధికంగా 641 కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది.