ఇరాన్ లో 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ 

ఇరాన్ లో 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ 

గల్ఫ్ దేశమైన ఇరాన్ లో కరోనా రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నది.  ఇప్పటికే ఆ దేశంలో కరోనా వలన దాదాపుగా 800 మంది మరణించారు.  వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఆయిల్ ఉత్పత్తి దేశం కాబట్టి ఆ దేశంలో పనిచేయడానికి వివిధ దేశాలనుంచి వేలాది మంది వస్తుంటారు.  ముఖ్యంగా ఇండియా నుంచి ఇరాన్ వెళ్లి అక్కడ పనిచేసే వ్యక్తులు చాలామంది ఉంటారు.  

అయితే, ఇరాన్ లో నివసిస్తున్న 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది.  వీరికోసం ఓ హెల్ప్ లైన్ ను తీసుకొచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  ఇరాన్ నుంచి ఇటీవలే కొంతమంది ఇండియాకు తీసుకొచ్చారు.  వారిని ప్రస్తుతం ఢిల్లీలో క్వారెంటైన్ కేంద్రంలో ఉంచారు.