అయోధ్య రామాలయ భూమి పూజ..వీరికే ఆహ్వానం.!
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపిస్తోంది. కార్యక్రమానికి మొత్తం 250 మంది అతిధులను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట జూన్ 10వ తేదీనే పునాదులు వేయాలని భావించారు. కానీ కరోనా విజృంభణ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఆగస్టు 5న నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని మోడీ కి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానించే 250 మందిలో అయోధ్యలోని సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తులు, కొందరు కేంద్ర మంత్రులు, ఉత్తర ప్రదేశ్ మంత్రులతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)