భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 

భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 

ఇండియాలో రోజు రోజుకు కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  గతంలో 10 వేల కరోనా కేసులు వస్తే వామ్మో అనుకునే వాళ్ళం. ఆ సంఖ్య ఇప్పుడు డబుల్ అయ్యింది. రోజుకు ఇండియాలో 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,850 కరోనా కేసులు నమోదయ్యాయి.  

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,165కి చేరింది.  ఇందులో 2,44,814 యాక్టివ్ కేసులు ఉండగా, 4,09,083 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  గత 24 గంటల్లో 613 మంది కరోనా కారణంగా మరణించారు.  ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అని చెప్పాలి.  దీంతో ఇండియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 19,268కి చేరింది.  ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.