తూర్పు గోదావరి జిల్లాలో మళ్ళీ కర్ఫ్యూ...

తూర్పు గోదావరి జిల్లాలో మళ్ళీ కర్ఫ్యూ...

ఆంద్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు.  ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. వరసగా ఇది నాలుగో ఆదివారం జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది.  ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు జిల్లా అంతటా కర్ఫ్యూ ఉంటుంది. అత్యవసర సేవలు, ప్రభుత్వ కార్యకలాపాలు, వైద్యసేవలకు మినహాయంపు ఉంటుంది.  తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రతి ఆదివారం కర్ఫ్యూను కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు.