తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 11 మంది మృతి 

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 11 మంది మృతి 

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరగడం మొదలైంది.  కరోనా కేసులకు సంబంధించిన బులెటిన్ ను ఆరోగ్యశాఖ రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 2384 కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,04,249కి చేరింది.  ఇందులో 80,586 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,908 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  తెలంగాణ హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు.  దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 755 కి చేరింది.  గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1851 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  హైదరాబాద్ లో 472, నిజామాబాద్ లో 148, నల్గొండలో 137 కేసులు నమోదయ్యాయి.