ఢిల్లీలో క‌రోనా కేసుల కొత్త రికార్డు..

ఢిల్లీలో క‌రోనా కేసుల కొత్త రికార్డు..

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. ఇవాళ ఢిల్లీ స‌ర్కార్ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. ఒకే రోజు అత్య‌ధికంగా 2,244 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. 99 వేలు దాటాయి క‌రోనా పాజిటివ్ కేసులు ‌.. ఇక‌, గ‌త 24 గంట‌ల్లో 63 మంది క‌రోనా బారిన‌ప‌డిన‌వారు మృతిచెందారు.. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య మూడు వేలు దాటింది.. తాజా లెక్క‌ల ప్ర‌కారం.. ఢిల్లీలో 99,444 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 3,067 మంది మృతిచెందారు.. ఇక‌, ఇవాళ 3,083 మంది క‌రోనా నుంచి కోలుకుని వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. ప్ర‌స్తుతం 25,038 మంది క‌రోనాబారినప‌డి చికిత్స పొందుతున్నారు. దేశరాజధానిలో ఇప్పటి వరకు 6,43,504 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించిన‌ట్టు స‌ర్కార్ ప్ర‌క‌టించింది.