పవన్ ‘బద్రి’ వచ్చి 21 ఏళ్ళు

పవన్ ‘బద్రి’ వచ్చి 21 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘బద్రి’ నేటితో విజయవంతంగా 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడిగా పూరి జగన్నాథ్ డెబ్యూ మూవీ ఇది. ఈ 21 సంవత్సరాల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా ఎదిగిన పూరి.. డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా రేణు దేశాయ్, అమీషా పటేల్ నటించారు. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు రేణు దేశాయ్ పరిచయమైంది. పవన్ కళ్యాణ్ మ్యానరిజం, పూరి డైలాగ్స్, రమణ గోగుల సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ అని చెప్పాలి. ‘నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రీనాథ్‌.. అయితే ఏంటి?’ అంటూ పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలకు ఇప్పటికీ అదే క్రేజ్ వుంది. టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లోనే 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.