అక్కడ కరోనాకు వైద్యం చేయకపోతే ఆస్పత్రులు సీజ్

అక్కడ కరోనాకు వైద్యం చేయకపోతే ఆస్పత్రులు సీజ్

ఢిల్లీలో రోజు రోజూకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు...కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రిలో 100 శాతం, అన్ని  ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 20 శాతం బెడ్‌లను కరోనా రోగులుకు కేటాయించాలని అన్నారు...ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా రోగులను ఎట్టి పరిస్థితిలో వెనక్కి పంపించరాదని ఆస్పత్రి యాజమాన్యాలను సీఎం హెచ్చరించారు...రాష్ట్ర వ్యాప్తంగా 117 ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు...కరోనా బాధితులకు వైద్యం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైనే ఆస్పత్రిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.