తెలంగాణలో తగ్గని కరోనా ఉదృతి: 11 మంది మృతి... 

తెలంగాణలో తగ్గని కరోనా ఉదృతి: 11 మంది మృతి... 

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2043 కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,67,046కి చేరింది.  ఇందులో 1,35,357 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,673 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 11 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1016కి చేరింది.  జీహెచ్ఎంసి పరిధిలో 314, కరీంనగర్ లో 114, మేడ్చల్ లో 144, నల్గొండలో 131, రంగారెడ్డిలో 174, సిద్ధిపేటలో 121, వరంగల్ అర్బన్ లో 108 కేసులు నమోదయ్యాయి.