ఫుట్‌బాల్ సమరం.. మొదలు..!

ఫుట్‌బాల్ సమరం.. మొదలు..!

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21 సీజన్ సందడి మొదలవ్వనుంది. 6 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఐఎస్‌ఎల్.. ఏడో సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం నుంచే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21 సీజన్ సందడి మొదలవ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగన్, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ మధ్య గోవా వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ తరహాలోనే ఐఎస్‌ఎల్ కూడా ఖాళీ మైదానాల్లోనే బయో బబుల్ వాతావరణంలో జరగనుంది. టోర్నీ మొత్తం గోవాలోని మూడు మైదానాల్లోనే నిర్వహించనున్నారు. కొత్త జట్టు రాకతో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 95 నుంచి 115కు పెరిగాయి. మొత్తం 11 క్లబ్స్ ఐపీఎల్ తరహాలోనే డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడనున్నాయి.