థార్ పై వినియోగదారుల ఆసక్తి... ఇదే కారణం...!!

థార్ పై వినియోగదారుల ఆసక్తి... ఇదే కారణం...!!

మహీంద్రా కార్ల కంపెనీ వినియోగదారుల కోసం పాత థార్ కార్లను మార్పులు చేసి కొత్తతరం థార్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇటీవలే దీనికి సంబంధించిన థార్ మోడల్ కారును రిలీజ్ చేశారు.  ఆకట్టుకునే రూపంతో, అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ కార్లు ఎట్రాక్టింగ్ గా ఉండటంతో ఈ కార్ల బుకింగ్ కోసం వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.  అక్టోబర్ 2 వ తేదీన ఈ కార్ల బుకింగ్ ను మహీంద్రా కంపెనీ ప్రారంభించింది.  కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 9000 లకు పైగా బుకింగ్స్ జరిగాయి.  ప్రస్తుతం 18 నగరాల్లో మాత్రమే బుకింగ్ జరుగుతున్నది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాల్లో బుకింగ్ ప్రారంభిస్తామని మహీంద్రా కంపెనీ పేర్కొన్నది.  ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ టాప్, కన్వర్టబుల్ టాప్ కార్లను బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపించారు.  36వేలమందికి పైగా ఈ కార్ గురించి ఎంక్వైరీ చేసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.