పబ్జీ కలిపింది ఇద్దరినీ...!

  పబ్జీ కలిపింది ఇద్దరినీ...!

దేశంలో పబ్జి ఆన్లైన్ గేమ్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ ఆన్లైన్ గేమ్ కు బానిసలై ఎంతోమంది తమ బంగారం లాంటి భవిష్యత్తులను నాశనం చేసుకున్నారు. పబ్జి అడనివ్వట్లేదని..పబ్జి ఆడటానికి ఫోన్ కొనివ్వలేదని..ఆడితే ఇంట్లో వాళ్ళు మందలించారని ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతే కాకుండా పబ్జికి బానిసై గంటలు తరబడి ఆడి మెడ నరాలు పట్టుకుని చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా పబ్జి గేమ్ ఇద్దరిని కలిపింది కూడా. తమిళనాడులోని బాబిష అనే 20ఏళ్ల అమ్మాయి లాక్ డౌన్ సమయంలో బోర్ కొట్టి పబ్జి ఆడటం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో ఆమెకు అజిత్ ప్రిన్స్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల తరవాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ మరింత దగ్గరయ్యారు. ఇక తాజాగా బాబిష తన ప్రియుడు అజిత్ తో కలిసి ఇంటినుండి వెళ్లిపోయింది. దాంతో తల్లి తండ్రులు తిరువత్తర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రేమికులను పట్టుకున్నారు. కాగా తాము అప్పటికే పెళ్లి చేసుకున్నామని బాబిష పోలీసులతో చెప్పింది. తల్లి తండ్రులు ఆమె ప్రేమను అంగీకటించనప్పటికి ఆమె అజిత్ తోనే ఉండటానికి ఇష్టపడింది.