అత్యంత పిన్నవయసులో..అవయవదానం చేసిన చిన్నారి

అత్యంత పిన్నవయసులో..అవయవదానం చేసిన చిన్నారి

దేశంలోనే అత్యంత పిన్నవయసు అవయవదాతగా నిలిచింది ధనిష్తా.. తమ బిడ్డ చనిపోయినప్పటికి.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. పాప కుటుంబం చేసిన ఈ గొప్ప పని నిజంగా ప్రశంసనీయమని డాక్టర్లు అన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఆశిశ్ కుమార్, బబితా దంపులకు కూతురు ధ‌నిష్తా.. 20 నెలల ఆ చిన్నారి ఈ నెల 8న బాల్క‌నీలో నుంచి ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో గమనించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటిన గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారికి ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక తమకు దక్కదని తెలిసిన ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంతటి విషాదంలోనూ తల్లిదండ్రులు.. ఆ చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. చిన్నారికి సంబంధించిన గుండె, కాలేయం, కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు పేషేంట్ లకు దానం చేశారు. దింతో దేశవ్యాప్తంగా ఈ వార్త వైరల్ గా మారింది.