వ్యాక్సిన్‌ వికటించి బాలుడు మృతి

వ్యాక్సిన్‌ వికటించి బాలుడు మృతి

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్‌ వేసుకున్న ఫైజాన్ అనే రెండు నెలల బాలుడు అస్వస్థతకు గురై మృతిచెందాడు. బుధవారం నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో మొత్తం 90 మంది చిన్నారులకు వాక్సిన్ ఇచ్చారు. వాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్ లు వేరేవి ఇవ్వటంతో.. 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు నిలోఫర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఈ రోజు ఫైజాన్ అనే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. మరో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమమంగా ఉందని వైద్యులు తెలిపారు. ముగ్గురు చిన్నారులకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నిలోఫర్ ఆస్పత్రికి బాధిత కుటుంబ సభ్యులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.