ఆర్ఆర్ఆర్ టీజర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు..
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. వీరిద్దరి వేర్వేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి "రామరాజు ఫర్ భీమ్" టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 22న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు వచ్చిన టీజర్ టాలీవుడ్లో చరిత్రలో ఇది వరకు లేదు. ఇక ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 3 కోట్ల 26 లక్షల వ్యూస్ రాగా... 11 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ టీజర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొమురం భీంగా అదరగొట్టాడు. కాగా.. ఈ టీజర్ పై వివాదం కూడా రాజుకున్న విషయం తెలిసిందే.. ఆదివాసులను కించ పరిచేలా ఉందని బీజేపీ ఈ టీజర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. ఈ సినిమాను ఆపుతామని కూడా హెచ్చరించింది బీజేపీ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)