అయోధ్య: అవసరమైతే 1992 లాంటి నిర్ణయం

అయోధ్య: అవసరమైతే 1992 లాంటి నిర్ణయం

అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయంపై హిందువులంతా అవమానం ఫీలవుతున్నారని, కోర్టు కామెంట్లపై ఆగ్రహంతో ఉన్నారని ఆర్ఎస్ఎస్ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన మూడు రోజుల సమావేశాల ముగింపులో ఆ సంస్థ జాయింట్ సెక్రటరీ భయ్యాజీ జోషీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే మందిర్ నిర్మాణం కోసం 1992 లాంటి తరహాలో భారీ ఉద్యమం చేపడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. "అవసరమైతే ఆ పని కూడా చేస్తాం" అన్నారు జోషీ. 

అక్టోబర్ 29న కోర్టు ముందుకొచ్చిన అయోధ్య కేసును త్రిసభ్య ధర్మాసనం జనవరికి వాయిదా వేసింది. ఇప్పటికిప్పుడే విచారించాల్సన అవసరం లేదని, తమకు వేరే ప్రాథమ్యాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చారు.