తెలంగాణలో నిలకడగా కరోనా...

తెలంగాణలో నిలకడగా కరోనా...

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ఒకరోజు కేసుల సంఖ్య తగ్గుతున్నట్టే కనిపించినా ఆ తరువాత తిరిగి సంఖ్య పెరుగుతున్నాయి.  తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1982 కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79495కి చేరింది.  ఇందులో 55999 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో 12 మంది కరోనా తో మరణించారు.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 627కి చేరింది.  భద్రాద్రి కొత్తగూడెం లో 64, జీహెచ్ఎంసి లో 463, జనగాం లో 78, జోగులాంబ గద్వాల్ లో 93, కామారెడ్డిలో 62, కరీంనగర్ లో 96, మేడ్చల్ లో 141, నల్గొండలో 59, నిజామాబాద్ లో 58, పెద్దపల్లిలో 71, రంగారెడ్డిలో 139, సిద్ధిపేటలో 55, వరంగల్ అర్బన్ లో 71 కేసులు నమోదయ్యాయి.