తెలంగాణ‌లో 90వేలు దాటిన క‌రోనా కేసులు... ఇవాళ ఎన్నంటే...?

తెలంగాణ‌లో 90వేలు దాటిన క‌రోనా కేసులు... ఇవాళ ఎన్నంటే...?

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది... 90 వేల‌ను క్రాస్ చేశాయి క‌రోనా పాజిటివ్ కేసులు... తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో 1863 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఇదే స‌మ‌యంలో 10 మంది మృతిచెందారు.. దీంతో.. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,259కి చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనాబారిప‌డి 684 మంది మ‌ర‌ణించారు. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో 1912 మంది క‌రోనాబారిన‌ప‌డి కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 66,196కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 23,379 ఉన్నాయ‌ని బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్.. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 394, మేడ్చెల్ 174, కరీంనగర్ 104, వరంగల్ అర్బన్ 101, రంగారెడ్డి జిల్లా 131, సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, జగిత్యాల 61, సిద్దిపేటలో 60 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న‌టి పోలిస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు త‌గ్గుముఖం ప‌ట్టింది.