తెలంగాణలో కరోనా విజృంభణ: ఈరోజు కూడా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు... 

తెలంగాణలో కరోనా విజృంభణ: ఈరోజు కూడా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు... 

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.  గతంలో కేసులు వెయ్యిలోపే ఉండగా గత నాలుగు రోజులుగా  1500లకు మించి కేసులు నమోదవుతున్నాయి.  తాజా హెల్త్ బులిటెన్ రిపోర్ట్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో   1831 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,733కి చేరింది.  ఇందులో  10466 కేసులు  యాక్టివ్ గా ఉంటె, 14,781 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

ఇకపోతే, గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మరణించారు.  దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 306కి చేరింది.  నమోదైన 1831 కేసుల్లో  1419కేసులు  జీహెచ్ఎంసి పరిధిలో ఉండటం విశేషం.  జీహెచ్ఎంసి తరువాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 160  కేసులు నమోదు కాగా,  మేడ్చల్ లో 117 కేసులు నమోదయ్యాయి.  సంగారెడ్డి లో 3, కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 9, గద్వాల్ లో 1, నల్గొండ, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలో 9 చొప్పున, వికారాబాద్ లో 7, మెదక్ జిల్లాలో 20, సూర్యాపేట లో 1,  పెద్దపల్లిలో 9, యాదాద్రిలో 1, సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, జగిత్యాలలో 4, మెహబూబాబాద్ లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.