భార్య చెల్లెలికు కడుపు...అబార్షన్ ఫెయిలయి మృతి !

భార్య చెల్లెలికు కడుపు...అబార్షన్ ఫెయిలయి మృతి !

 
అక్క మొగుడే కదా అని.. కాస్త చనువుగా ఉంది. కానీ ఆ దుర్మార్గుడి దురాలోచన పసిగట్టలేదు. మాయ మాటలకు లొంగిపోయింది. చిన్న వయసులోనే గర్భం దాల్చింది. ఎవరికీ చెప్పొద్దంటూ ఆ కామాంధుడు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి ప్రాణాలే కోల్పోయింది.  సిక్కోలు జిల్లాలో ఓ ప్రభుద్ధుడి నిర్వాకానికి .. అన్నెం పుణ్యం తెలియని బాలిక బలైంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో ఓ కామాంధుడి లైంగిక దాడికి ఓ బాలిక బలైపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో కూలీగా పనిచేసే కిరణ్‌.. కొన్నాళ్ల క్రితం సొంతూరు కంచిలికి వచ్చాడు. భార్య చెల్లెలితో చనువు పెంచుకున్నాడు. అక్క భర్తే కదా అని చనువిచ్చిన బాలిక అతని మాయమాటలకు లొంగిపోయింది. దీంతో మళ్లీ కోల్ కతా వెళ్లిపోయాడు కిరణ్ . 

కొన్నాళ్లకు ఆ బాలిక గర్భందాల్చింది . ఈ విషయాన్ని కోల్‌కతాలో ఉన్న బావకు చెప్పింది. అయితే, ప్రస్తుతం లాక్ డౌన్ లో చిక్కుకుపోయానని, తిరిగి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు . దీంతో ఆ బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది . అయితే, కడుపులో పిండం పెరగడంతో పరిస్థితి చేయిదాటింది తల్లిదండ్రులు ప్రశ్నించడంతో అసలు నిజం చెప్పింది. ఈ విషయంలో ఫోన్లో అల్లుణ్ని నిలదీశారు బాలిక తల్లిదండ్రులు. ముందు అబార్షన్‌ చేయించండి వచ్చాక అంతా చక్కదిద్దుతానని బదులిచ్చాడు. 

అబార్షన్ కు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని హామీ ఇచ్చాడు . దీంతో గత్యంతరం వారం క్రితం సోంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. ఐతే మూడు రోజుల తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడించింది. దీంతో కడుపు తీపితో బాలిక తల్లి అల్లుడి పైనా, కుమార్తెకు అబార్షన్ చేసిన డాక్టర్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.