పబ్జికి బానిసై ... ఆహారం తీసుకోవడం మానేసి... చివరకు ఇలా... 

పబ్జికి బానిసై ... ఆహారం తీసుకోవడం మానేసి... చివరకు ఇలా... 

పబ్జి గేమ్ యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది.  పబ్జి గేమ్ ను ఆడటం మొదలుపెడితే  క్రమంగా దానికి బానిస కావాల్సి వస్తుంది.  ఫలితంగా జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.  ఇటీవలే ఓ యువకుడు పబ్జికి బానిసయ్యి... తన తల్లిదండ్రుల అకౌంట్ ను ఖాళీ చేశాడు.  ఇలానే ఓ యువకుడు ఈ గేమ్ కు బానిసయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  ఈ సంఘటన  పశ్చిమ గోదావరి జిల్లాలోని జాజులకుంట గ్రామంలో జరిగింది.  

పబ్జికి బానిసైన యువకుడు ఆట మత్తులో పడి భోజనం చేయడం మానేశాడు.   కనీసం నీళ్లు కూడా తాగడం మర్చిపోవడంతో, కొన్నాళ్ల తరువాత అనారోగ్యం బారిన పడ్డాడు.  దీంతో తల్లిదండ్రులు ఆ యువకుడిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందించారు.  ఆహరం తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ అయ్యిందని, డయేరియా బారిన పడినట్టు వైద్యులు తెలిపారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు కన్నుమూశాడు.  చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.