దారుణం: బస్సుపై విరిగిపడిన కొండచరియలు... 16 మంది మృతి... 

దారుణం: బస్సుపై విరిగిపడిన కొండచరియలు... 16 మంది మృతి... 

పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్ బాల్టిస్తాన్ లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి.  ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు.  రావుల్పిండి నుంచి స్కర్దు ప్రాంతానికి బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.  ప్రయాణిస్తున్న బస్సుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో బస్సు లోయలో పడినట్టు పాక్ మీడియా ప్రకటించింది.  పాక్ మీడియా వివరాల ప్రకారం రౌండో ఏరియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం మామూలే అని అక్కడి స్థానికులు చెప్తున్నారు.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రాంతాలను అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫలితంగానే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.