ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 15,144 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,57,985కి చేరింది. ఇందులో 1,01,96,885 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,08,826 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 181 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,52,274కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,170 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)