చిన్నవయసులో...గొప్ప మనసు..!

చిన్నవయసులో...గొప్ప మనసు..!

సింగపూర్ లో 15ఏళ్ల తెలుగు కుర్రాడు కోవిడ్ బాధితులకోసం ‘నేను సైతం’ అంటూ కదిలాడు. గుంటూరుకు చెందిన శ్రీహర్ష సింగపూర్‌ అమెరికన్‌ హై స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఇటీవల అతడు ‘‘అవసరమైన వారికి సహాయం చేయండి. వారిలో ఆశలను నింపండి’’ అనే నినాదంతో విరాళాలను సేకరించాడు. కాగా అతడి వద్ద మొత్తం 20 లక్షల వరకు విరాళాలు పొగవ్వటంతో ఆ మొత్తాన్ని  సింగపూర్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గివ్‌ డాట్‌ ఎస్‌.జీ’ అనే చారిటీ సంస్థకు అందజేశాడు. ‘గివ్‌ డాట్‌ ఎస్‌.జీ’ అనే సంస్థ సింగపూర్ లో కరోనా భాదితుల కోసం అవసరమైన వైద్యం, మందులు, తదితర సదుపాయాలను అందజేస్తోంది. మరో వైపు తాను కూడా స్నేహితులతో కలిసి  ‘ఎకాన్‌ 101’ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించే లక్ష్యంతో  90 రోజుల పాటు స్వచ్ఛంద కార్యక్రమాలను సైతం నిర్వహించాడు. 8 నుంచి 13 ఏళ్ల వయస్సు గల పిల్లలకు శ్రీహర్ష జూమ్ యాప్ ద్వారా ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నాడు.