గుంటూరులో 15 రోజులు లాక్‌డౌన్..!

గుంటూరులో 15 రోజులు లాక్‌డౌన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. తాజా బులెటిన్‌లో ప‌రిశీలిస్తే.. ప్ర‌తీ నాలుగు టెస్ట్‌ల్లో ఒక‌రికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతుంది.. దీంతో.. కోవిడ్ తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.. ఇక‌, గుంటూరు సిటీలోనూ భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇవాళ ఏకంగా 475 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. గుంటూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అప్ర‌మ‌త్తం అవుతుంది.. గుంటూరు సిటీలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ లాంటి ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించారు.. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ కావటి మనోహర్ నాయుడు.

ఈ నెల 22 తేదీ నుంచి నగరంలో ఆంక్షలు ఉంటాయ‌ని.. ఉదయం 9 గంట‌ల‌ నుండి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపారాల‌కు అనుమ‌తి ఉంటుంద‌న్నారు మేయ‌ర్ మ‌నోహ‌ర్.. సాయంత్రం 6 గంటల త‌ర్వాత అన్నిర‌కాల వ్యాపారాలు మూసివేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇక‌, 25వ‌ తేదీ నుండి రాత్రి 7 గంట‌ల నుండి ఉదయం 5 గంట‌ల‌ వరుకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని.. 15 రోజులు పాటు నగరంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌న్నారు. అయితే, ఈ స‌మ‌యంలో.. మెడికల్, అత్యవసర స‌ర్వీసుల షాపులకు 24 గంటలు అనుమతి ఉంటుంద‌న్న మేయ‌ర్.. నగరంలోని ప్రజలు ప్రతీ ఒక్కరూ సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల‌ని కోరిన ఆయ‌న‌.. విధిగా మాస్క్ ధ‌రించాలి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాల‌న్నారు.