తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... 

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... 

తెలంగాణలో కరోనా కేసులు నిన్నటి వరకు నిలకడగా ఉన్నాయి.  అయితే, ఈరోజు కేసుల సంఖ్య పెరిగినట్టు తాజా బులెటిన్ ద్వారా తెలుస్తోంది.  గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  47,705కి చేరింది.  ఇందులో 10,891 కేసులు యాక్టివ్ గా ఉంటె, 36,385 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో తెలంగాణలో  ఏడు కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 429కి చేరింది.  ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, జీహెచ్ఎంసిలో 703, రంగారెడ్డిలో 107, మేడ్చల్ లో 105, సంగారెడ్డిలో 50, ఖమ్మంలో 14, కామారెడ్డిలో 43, వరంగల్ అర్బన్ లో 34, వరంగల్ రూరల్ లో 20, నిర్మల్ లో 1, కరీంనగర్ లో 27, జగిత్యాలలో 18, యాదాద్రిలో 9, మహబూబాబాద్ లో 27, పెద్దపల్లి లో4, మెదక్ లో 26,  మహబూబ్ నగర్ లో 6, మంచిర్యాలలో 5, భద్రాద్రి కొత్తగూడెం లో 5,  జయశంకర్ భూపాలపల్లిలో 27, నల్గొండలో 45, రాజన్న సిరిసిల్లలో 8, ఆదిలాబాద్ లో 7, వికారాబాద్ లో 9, నగర్ కర్నూల్ లో 18, జనగాం లో 9, నిజామాబాద్ లో 48, సిద్ధిపేట 14, సూర్యాపేటలో 27, జోగులాంబ గద్వాల్ లో 4 కేసులు నమోదయ్యాయి.