పాకిస్తాన్: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన ఆలయం...

పాకిస్తాన్: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన ఆలయం...

పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో పాక్ పురావస్తుశాఖ, ఇటలీకి చెందిన పురావస్తు నిపుణులు కలిసి తవ్వకాలు జరుపుతున్నారు.  ఈ తవ్వకాల్లో 1300 సంవత్సరాల క్రితం నాటి పురావస్తు ఆలయం ఒకటి బయటపడింది.  క్రీస్తు శకం 850-1036 మధ్య కాలానికి చెందిన ఆలయంగా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  విష్ణు ఆలయం అని, కాబూల్ లోయను అప్పట్లో పరిపాలించిన హిందూ షాహీలు ఆ ఆలయాన్ని నిర్మించి ఉంటారని అంటున్నారు.  ఆలయం బయటపడిన చోట కొలను, వాచ్ టవర్, కంటోన్మెంట్ వంటి వాటిని కూడా గుర్తించారు.  స్వాత్ లోయలోని బారీకోట్ ఘండాయ్ ప్రాంతాన్ని హిస్టారికల్ ప్లేస్ గా డెవలప్ చేస్తామని పురావస్తు శాఖ చెప్తున్నది.