కోహ్లీ కెరియర్ కు 12 ఏళ్ళు...

కోహ్లీ కెరియర్ కు 12 ఏళ్ళు...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు ఈ రోజుతో 12 ఏళ్ళు. కోహ్లీ 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి మ్యాచ్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ ఈ 12 ఏళ్లలో  వన్డే లో నెంబర్ వన్ బాట్స్మెన్ గా ఎదిగాడు. ఇక తన కెరియర్ లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ వన్డే లో వేగంగా 10,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు ఈ రికార్డు 259 ఇన్నింగ్స్ లో సచిన్ పేరు మీద ఉండగా దానిని కోహ్లీ కేవలం 205  ఇన్నింగ్స్ లో కోహ్లీ సాధించాడు. ఇక 2014 లో టెస్ట్ కెప్టెన్ అయిన విరాట్ 2017 లో వన్డే, టీ 20 లో భారత పగ్గాలు చేపట్టాడు.    

ఇక ఇప్పటివరకు తన కెరీర్‌లో 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలోనూ 50 పైగా సగటుతో వరుసగా 7,240, 11,867, 2,794 పరుగులు చేసాడు. ఇందులో మొత్తం 70 శతకాలు ఉన్నాయి. అందుకే సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని బ్రేక్ చేయగల ఆటగాళ్ల గురించి వచ్చినప్పుడు కోహ్లీ అందులో ముందుంటాడు. ఇక ఆటగాడిగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్టులో 2, వన్డేలో 1, టీ 20లో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే కెప్టెన్ గా భారత జట్టుకు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందించని కోహ్లీ భవిష్యత్తులో అందిస్తాడేమో చూడాలి.