దుమ్మురేపుతున్న "పుష్ప" టీజర్... 12 మిలియన్ వ్యూస్

దుమ్మురేపుతున్న "పుష్ప" టీజర్... 12 మిలియన్ వ్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప". రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్ డే. ఈ సందర్బంగా ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం 'పుష్ప' టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్, 600కే లైక్స్ తో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం 'పుష్ప' టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ టీజర్ 24 గంటల్లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక టీజర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్, రష్మిక మందన్న క్యూట్ లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు అదిరిపోయాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 13న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.