ఆ సంఖ్యతో విరాట్ కు విడదీయలేని బంధం...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ భార్య అనుష్క శర్మ నిన్న జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దానో కోహ్లీ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. 11 అనే సంఖ్యతో విరాట్ కోహ్లీ విడదీయని బంధం ఉందంట!. ఎలా అంటే... కోహ్లీ పుట్టిన నెల, పెళ్లి రోజు, తండ్రైన రోజు, కెరీర్లో సాధించిన ఘతనలన్నిటీ 11తో సంబంధం ఉండటం ఇప్పడు చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీ బర్త్‌డే 11వ నెల... అనుష్కశర్మతో పెళ్లి డిసెంబర్ 11న జరిగింది. జనవరి 11న కూతురు పుట్టింది. ఓ క్యాలండర్ ఇయర్లో 11 సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్ కోహ్లీనే. అంతేకాకుండా అప్‌కమింగ్ టీ20 వరల్డ్ కప్.. కోహ్లీ కెరీర్లో 11వ ఐసీసీ టోర్నమెంట్. దాంతో విరాట్ కోహ్లీకి 11వ నంబర్‌కు విడదీయని బంధం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ 11వ ఐసీసీ టోర్నమెంట్ ను కోహ్లీ విజయం సాధిస్తాడా... లేదా నేది చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)