ఇండియా కరోనా అప్డేట్: దేశంలో కొత్తగా ఎన్నంటే... 

ఇండియా కరోనా అప్డేట్: దేశంలో కొత్తగా ఎన్నంటే... 

ఇండియాలో కరోనా  ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.  గతంలో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి.  కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 15వేల దిగువకు పడిపోయింది.  తాజా కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 11,666 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కి చేరింది.  ఇందులో 1,03,73,606 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,73,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 123 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,847కి చేరింది.