కరోనా అప్డేట్: ఏపీలో తగ్గిన కరోనా కేసులు... 

కరోనా అప్డేట్: ఏపీలో తగ్గిన కరోనా కేసులు... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 1160 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,61,092కి చేరింది.  ఇందులో 8,39,395 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 14,770 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6927కి చేరింది.  ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.  అనంతపూర్ లో 43, చిత్తూరులో 148, తూర్పు గోదావరిలో 165, గుంటూరులో 121, కడపలో 70, కృష్ణాలో 189, కర్నూలులో 23, నెల్లూరులో 60, ప్రకాశంలో 66, శ్రీకాకుళంలో 46, విశాఖపట్నంలో 67, విజయనగరంలో 42, పశ్చిమ గోదావరిలో 120 కరోనా కేసులు నమోదయ్యాయి.