కరోనా పంజా.. ఒకే కుటుంబంలో 11 మందికి పాజిటివ్

కరోనా పంజా.. ఒకే కుటుంబంలో 11 మందికి పాజిటివ్

భారత్ లో కరోనా పంజా విసురుతోంది.. కాస్త నెమ్మదిగా అనిపించినా.. ఒకేరోజు దేశవ్యాప్తంగా 437 కొత్త కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం.. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ లో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా సోకింది. ఒకరి నిర్లక్ష్యం వల్ల జైపూర్‌లో ఓ కుటుంబంలోని 11 మందికి కరోనా వచ్చింది. రామ్‌గంజ్‌కు చెందిన ఓ వ్యాపారి మార్చి 12న ఒమన్‌ నుంచి తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచి సొంతూరు చేరుకున్న మరునాడు స్నేహితుడితో మార్కెట్‌ వద్ద కొంతసేపుగడిపారు. దాదాపు  53 మందిని కలిశాడు. ఆ తర్వాత ఆ వ్యాపారి, మిత్రుడు, మిత్రుడి కుటుంబంలోని పది మందికి కలిపి మొత్తంగా 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక, మరింత మందికి వైరస్‌ వ్యాపించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఇంటింటా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఒకరి నిర్లక్ష్యం ఇలా అందరికి వైరస్ పాకేలా చేసింది.