ఐపీఎల్ లో పాల్గొన 11 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు వీరే...

ఐపీఎల్ లో పాల్గొన 11 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు వీరే...

బీసీసీఐ ఆధ్వర్యం లో 2008 లో ప్రారంభం అయిన ఐపీఎల్ టోర్నమెంట్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికి తెలుసు. అయితే ఇందులో ప్రపంచంలోని అన్ని దేశాల నుండి ఉత్తమ క్రికెటర్లను కనిపిస్తారు. విదేశీ ఆటగాళ్లు తరచూ తమ ఐపిఎల్ ఫ్రాంచైజీలకు బ్యాట్, బంతి మరియు ఫీల్డింగ్‌తో చాల విజయాలను అందించారు. అయితే, పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం మన ఐపీఎల్ లో పాల్గొన్నారు. అయితే 2008 లో 11 మంది పాకిస్తాన్ ఆటగాళ్ళు ఐపీఎల్ మొదటి సీజన్ లో పాల్గొన్నారు. కాని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో అన్ని క్రీడా సంబంధాలను నిలిపివేసింది. ఇక ఆ తరువాత ఏడాది నుండి పాక్ ఆటగాళ్లు మన ఐపీఎల్ లో పాల్గొనడం లేదు. అయితే 12 సీజన్లు విజయవంతంగా సాగిన ఐపీఎల్ ప్రస్తుతం 2020 లో జరగాల్సిన 13వ సీజన్  కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అంతకముందు మొదటి సీజన్ లో ఆడిన ఆ 11 మంది ఆటగాళ్లు అలాగే వారు ఏ జట్టు తరుపున ఆడారు అనే వివరాలు ఇవే...


1. సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్)
2. షాహిద్ అఫ్రిది (డెక్కన్ చార్జర్స్)
3. షోయబ్ మాలిక్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
4. మిస్బా-ఉల్-హక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్)
5. మొహమ్మద్ ఆసిఫ్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
6. షోయబ్ అక్తర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
7. కమ్రాన్ అక్మల్ (రాజస్థాన్ రాయల్స్)
8. సల్మాన్ బట్ (కోల్‌కత నైట్ రైడర్స్)
9. ఉమర్ గుల్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
10. యూనిస్ ఖాన్ (రాజస్థాన్ రాయల్స్)
11. మహ్మద్ హఫీజ్ (కోల్‌కతా నైట్ రైడర్స్)