ఏపీలో పదోతరగతి పరీక్షలు రద్దు... ఆ విద్యార్థులు కూడా పాస్ 

ఏపీలో పదోతరగతి పరీక్షలు రద్దు... ఆ విద్యార్థులు కూడా పాస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ ఏడాది జరగాల్సిన పదోతరగతి పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.   దీంతో పదోతరగతి విద్యార్థులంతా పాస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దయ్యాయి.  ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు కావడంతో, ఇటీవలే  ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాస్ అయినట్టే అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.  

సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులు ఫీజు కట్టి ఉంటె, ఆ ఫీజును విద్యార్థులకు తిరిగి వాపస్ చేస్తామని  విద్యాశాఖామంత్రి తెలిపారు.  విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు  మంత్రి పేర్కొన్నారు.  పదోతరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని, త్వరలోనే గ్రేడింగ్ విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు.