ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 77 మరణాలు 

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 77 మరణాలు 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,128 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,86,461కి చేరింది.  ఇందులో 80,426 కేసులు యాక్టివ్ గా ఉంటె, 1,04,354 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 77 కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1681కి చేరింది.  

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.  అనంతపూర్ జిల్లాలో 1260, చిత్తూరులో 677, తూర్పు గోదావరిలో 1544, గుంటూరులో 730, కడపలో 729, కృష్ణాలో 440, కర్నూలులో 1368, నెల్లూరులో 537, ప్రకాశం జిల్లాలో 349, శ్రీకాకుళంలో 405, విశాఖపట్నంలో 842, విజయనగరం జిల్లాలో 665, పశ్చిమ గోదావరి జిల్లాలో 582 కేసులు నమోదయ్యాయి.