ప్రతి వారం మిలియన్ మంది దాని కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట...!!

ప్రతి వారం మిలియన్ మంది దాని కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట...!!

అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ఇప్పటి వరకు ఆ దేశంలో 45.94 లక్షల కేసులు నమోదయ్యాయి.  కేసుల్లోనే కాదు మరణాల సంఖ్యలో కూడా అమెరికా టాప్ ప్లేస్ లో ఉన్నది.  కరోనా మహమ్మారి విజృంభణతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  కరోనా మహమ్మారి అంతం అయ్యే వరకు వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా  తెరుచుకునేలా కనిపించడం లేదు.  

దీంతో నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకునేవారు సంఖ్య ప్రతివారం పెరుగుతూనే ఉన్నది.  గతవారం అత్యధికంగా 1.4 మిలియన్ మంది  నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకుననట్టు అక్కడి కార్మికశాఖ ప్రకటించింది.  గత 19 వారాలుగా ప్రతి వారం మిలియన్ సంఖ్యలో నిరుద్యోగులు భృతి కోసం అప్లై చేసుకుంటున్నారని, ఈ పరిస్థితి మారాలి అంటే వ్యాపార వాణిజ్య సంస్థలు తిరిగి పూర్తి స్థాయిలో ఓపెన్ కావాలని అప్పటి వరకు అమెరికా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందని కార్మిక శాఖ తెలియజేసింది.