సోము వీర్రాజు మీరు రాసిచ్చిన స్టేట్మెంట్ నే డీజీపీ చదువుతాడు !

సోము వీర్రాజు మీరు రాసిచ్చిన స్టేట్మెంట్ నే డీజీపీ చదువుతాడు !

యాత్రలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని ఏపి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా ప్రతినిథులతో బొత్స మాట్లాడుతూ సోమువీర్రాజు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. డీజీపీ పై అనుచిత వ్యాఖ్యలు తగదని హితువు పలికారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. నిందితులు మీ పార్టీ వారా? కాదా?  అని స్పష్టత ఇవ్వకుండా డీజీపీ ని టార్గెట్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, సీఎం జగన్ కు మంచి పేరు రాకూడదనే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆలయాలపై జరుగుతున్నదాడులపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. డీజీపికి స్టేట్ మెంట్ రాసివ్వండి సోము వీర్రాజు....మీరు రాసిచ్చిన స్టేట్ మెంట్ నే డీజీపీ చదువుతాడని ఆయన సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకో మరో పార్టీకో లబ్ధి చేసేందుకే   ఈరకమైన కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు.