ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ రాద్దు కావడానికి అతనే కారణమా..?

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో ఈరోజు ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే  బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తీ బయో బబుల్ ధాటినట్లు తెలుస్తుంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు… అక్కడే అతనికి వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జట్టులో కరోనా వచ్చిన ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించినట్లు బీసీకా స్పష్టం చేసింది. వైద్యుల బృదం నిరంతరం వారిని పర్యవేక్షిస్తుందని, వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లను కూడా వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపింది.

Related Articles

Latest Articles