ఇండస్ట్రీ నన్ను బ్యాన్‌ చేసినా భయపడను: పోసాని

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఏపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కామెంట్స్ చేశారు.

‘పవన్‌ కల్యాణ్ తనే ప్రశ్నలు వేసుకుంటారు.. తనే సమాధానాలు చెప్పుకుంటారు. ఆధారాలుంటే నేతలను ప్రశ్నించడం తప్పుకాదు.. పవన్‌ ప్రశ్నించడంలో తప్పులేదు, సాక్ష్యాలు చూపించాలి. చిరంజీవి నోటి నుంచి అమర్యాదకర పదాలు ఎప్పుడైనా వచ్చాయా..? రిపబ్లిక్‌ సినిమా ఫంక్షన్‌లో సీఎం, మంత్రులను పవన్‌ తిట్టడమేంటి..? పవన్‌ కల్యాణ్ ఏంటో పరిశ్రమకు, ప్రపంచానికి తెలుసు.. జగన్‌తో నీకు పోలికే లేదు.. చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందా పవన్‌ కల్యాణ్‌..? పవన్‌ కల్యాణ్‌ ప్రజల మనిషి కాదు, పరిశ్రమ మనిషీ కాదు.. ఇండస్ట్రీ నన్ను బ్యాన్‌ చేసినా నేనేం భయపడను’ అంటూ పోసాని కామెంట్స్ చేశాడు.

-Advertisement-ఇండస్ట్రీ నన్ను బ్యాన్‌ చేసినా భయపడను: పోసాని

Related Articles

Latest Articles