డ్రగ్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ ఇస్యు మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన ఇష్యూ కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరి అభిమానులు మద్దతు తెలియపరుస్తున్నారు. వ్యవస్థలోని లోపం పూనమ్ ఎత్తిచూపిందంటున్నారు. సినీ సెలెబ్రెటీలను నాలుగు రోజులు విచారణ జరిగి ఆతరువాత ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్నట్లుగా ఉండకూడదని నెట్టిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఎయిర్ పోర్టుల్లో, బార్డర్ లో కఠినమైన బందోబస్తు చర్యలను చేపట్టడం మంచిదంటున్నారు. సెలెబ్రిటీలైన, సామాన్యుడైన డ్రగ్స్ అలవాటు పడితే వాళ్ళు బాధితులే కానీ, నిందితులు కారని గత విచారణలోనే ముగింపు పలికినట్లుగా చెప్పిన సందర్భాన్ని గుర్తుచేస్తున్నారు.

కాగా ఇప్పటివరకు పూరీ, ఛార్మి విచారణ ఎదుర్కోగా, నేడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు మరికొందరు విచారణ ఎదుర్కోనున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-