“పికే లవ్” అంటూ మరోసారి తెరపైకి పూనమ్ కౌర్

“పికే లవ్” అంటూ పూనమ్ కౌర్ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో “పికే లవ్” అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశాయి. అప్పట్లో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మ్యాటర్ బాగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆమె చేసిన ఇన్ డైరెక్ట్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ “పికే లవ్” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి ఎవరి ఫొటోలో కాదు. ఇటీవల ఆమె దిగిన ఫొటోలే.

Read Also : “నో మోరల్స్” అంటూ సామ్ పోస్ట్… వాళ్ళ కోసమే!

కాకపోతే ఆమె తన ఫోటోలు షేర్ చేసిన పోస్టుకు “పికే లవ్” అనే హ్యాష్ ట్యాగ్ తగిలించడంతో నెటిజన్లలో ఆసక్తి మొదలైంది. కొంతమంది పికే అంటే పవన్ కళ్యాణ్ అంటుంటే మరికొంత మంది మాత్రం కాదు కాదు పూనమ్ కౌర్ అంటున్నారు. ఎవరేం అనుకుంటే ఏంటి పూనమ్ కౌర్ మాత్రం ఎలాగోలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో ప్రకాష్ రాజ్‌తో కలిసి దిగిన పిక్‌ను షేర్ చేసి ప్రెసిడెంట్ పదవి కోసం ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌కు తన సపోర్ట్ ను తెలియజేసింది.

Image
Image
Image
Image
-Advertisement-"పికే లవ్" అంటూ మరోసారి తెరపైకి పూనమ్ కౌర్

Related Articles

Latest Articles