వీడియో వైరల్ : ‘బుట్టబొమ్మ’తో అల్లు అర్హ డ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురము”లో సినిమా విడుదలై నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే తెర వెనుక జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్హతో ఉన్న ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె, అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హాతో కలిసి “రాములో రాములో” పాటకు డ్యాన్స్ చేస్తూ కన్పించారు. లొకేషన్‌లో నెక్స్ట్ షాట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ వీడియోను తీసినట్టు పూజా తెలిపింది. పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు పూజా మేకప్ తో రెడీ అవుతూ అల్లు అర్హను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తూ, అర్హకు డ్యాన్స్ చేస్తూ కన్పించింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Read Also : కల నెరవేరింది అంటూ మోహన్ బాబు కీలక ప్రకటన

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్ తో కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ విడుదల కోసం పూజా ఎదురు చూస్తోంది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మరోవైపు ఈ బ్యూటీ తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Related Articles

Latest Articles