‘ఆల్ ఎబౌట్ లవ్’ గురించి పూజా హెగ్డే!

అందమైన హీరోయిన్లకు, అందమైన మనసు ఉండాలనే నియమం ఏమీ లేదు! కానీ మన హీరోయిన్లు చాలామంది అందమైన మనసు ఉన్న వాళ్ళే కావడం విశేషం. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా వాళ్ళలో ఒకరు. ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా తనవంతు సాయాన్ని ఆపన్నులకు అందిస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు ‘ఆల్ ఎబౌట్ లవ్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. సమాజం తనకు ఇచ్చిన దానిని తిరిగి ఇవ్వడంగానే తాను భావిస్తున్నానని పూజా హెగ్డే చెబుతోంది.

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పూజా హెగ్డే తన ఛారిటీ సంస్థ గురించి చెప్పింది. తన నటనను అభిమానించి, ఆదరించి ప్రజలు ఇవాళ తనకో స్థానాన్ని కల్పించారని, అలాంటి వారికి తిరిగి తాను ఏదో ఒక చిన్నసాయమైనా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఛారిటీని ప్రారంభించానని పూజా తెలిపింది. ప్రజలు ఇచ్చిన ఆ స్థానాన్ని టేకిట్ గ్రాంట్ గా తాను తీసుకోలేనని, సమాజానికి తిరిగి మన వంతు సాయాన్ని పెద్దగానో, చిన్నగానో చేసేలా ఇతరులను ప్రేరేపించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పింది. మనస్ఫూర్తిగా మనం చేసే సేవతో సమాజంలో మార్పు తప్పక వస్తుందనే నమ్మకం తనకుందని ఆమె అన్నారు.

‘ఆల్ ఎబౌట్ లవ్’ ఛారిటీ సంస్థను ప్రారంభించక ముందు కూడా పూజా హెగ్డే పలు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. పేండమిక్ సిట్యుయేషన్ సమయంలో వందమంది రోజువారి కూలీలకు ఒక నెలకు సరిపడా నిత్యావసరాలను అందించింది. అలానే క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు మందులు ఇవ్వడం, కుటుంబ పెద్ద మంచాన పడిన వారికి బాసటగా నిలవడం చేసింది. తన ఫౌండేషన్ ద్వారా మంగళూర్ లోని దివ్యాంగ పిల్లలకు కృత్రిమ అవయవాలకై పూజా హెగ్డే కొంత మొత్తాన్ని విరాళం అందించింది.

ఇక సినిమాల విషయానికి వస్తే, ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉండగా, తమిళ చిత్రం ‘బీస్ట్’ షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్ లో జరగుతోంది. ఇవి కాకుండా పూజా హెగ్డే ఇప్పుడు పలు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-