నీలాంబరిని పరిచయం చేసిన చెర్రీ!

ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ‘హ్యపీ బర్త్ డే టు అవర్ నీలాంబరి, హావ్ ఎ గ్రేట్ ఇయర్ ఎహెడ్’ అంటూ చెర్రీ శుభాకాంక్షలు తెలిపాడు. నిజంగానే రాబోయే రెండు సంవత్సరాలు పూజా హెగ్డే కు గ్రేట్ అని చెప్పాలి.

‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే దసరా కానుకగా రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో విభాగా నటించింది. అలానే ‘ఆచార్య’లో చెర్రీతో జోడీ కట్టింది. ఇక వచ్చే సంక్రాంతికి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లోనూ నటించింది. ఇవి కాకుండా విజయ్ తమిళ చిత్రం ‘బీస్ట్’లోనూ, హిందీచిత్రం ‘సర్కస్’లోనూ నటిస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డే నే హీరోయిన్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. సో… పూజాకు ఇక రాబోయేవన్నీ మంచి రోజులే! అన్నట్టు ‘రంగస్థలం’లో కేవలం ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి, రక్తి కట్టించిన పూజా ఇప్పుడు ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా ఎన్ని హొయలు ఒలకబోస్తుందో చూడాలి.

-Advertisement-నీలాంబరిని పరిచయం చేసిన చెర్రీ!

Related Articles

Latest Articles