రణవీర్ సింగ్ ను ఆ రెండు అడుగుతానంటున్న పూజాహెగ్డే!

గత యేడాది ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే… కరోనా అనుభవాన్ని కూడా కాచి వడబోసేసింది. ఆమె నాయికగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అలానే ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉంది. ఇది కాకుండా విజయ్ తో ఓ తమిళ సినిమా, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ప్రధానమైంది రణవీర్ సింగ్ తో చేస్తున్న ‘సర్కస్’ ఒకటి. కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడానికి ముందే ఆ సినిమా షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొంది. రణవీర్ సింగ్ తో అనుభవం గురించి చెబుతూ, ‘నేనేమో ఇంట్రావర్ట్ ను. రణవీర్ సింగ్ దానికి పూర్తి ఆపోజిట్. ఆయనతో కలిసి ఆ సినిమాలో వర్క్ చేయడం నిజంగా గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఒక్కోసారి ఆయన్ని చూస్తుంటే… నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నానా! అనిపించేది. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ కూడా సూపర్బ్” అంటూ కితాబిచ్చింది పూజా హెగ్డే. ఒకవేళ రణవీర్ నుంచి మీరేం కోరుకుంటారని ఎవరైనా అడిగితే, ‘ఆయనలోని ఎనర్జీని, అబర్వేషన్ పవర్ ను కోరుకుంటానని చెబుతా’ అంటోందీ పొడగుకాళ్ళ సుందరి. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ‘సర్కస్’తో పాటు ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీలోనూ పూజా హెగ్డే నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-