రణవీర్ బాత్ రూమ్ సెల్ఫీపై పూజా హెగ్డే హాట్ కామెంట్.. వారి దృష్టిలో పడడానికేనా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు బాలీవుడ్ వైపు చూస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో లాంటి సినిమాలో కలిసి నటించినా అమ్మడికి మాత్రం హిట్ దక్కలేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ లో కూడా తన సక్సెస్ ని చూపించాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోల దృష్టిలో పడడానికి సోషల్ మీడియాను ఎంచుకోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఒక బాత్ రూమ్ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సెల్ఫీ చూసిన వారందరు రణవీర్ బాడీ గురించి, ఆయన సిక్స్ ప్యాక్స్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేశారు. ఇక ఈ ఫొటోకు పూజ కూడా కామెంట్ పెట్టగా.. అది కాస్తా వైరల్ గా మారింది. ఆ సెల్ఫీకి స్పందించిన పూజా ” టవల్ ఊడిపోయేలా ఉంది జాగ్రత్త” అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు పూజా ను ఆడేసుకుంటున్నారు. హీరోల దృష్టిలో పడడానికి ఇలాంటి కామెంట్లు పెడుతున్నావా అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం పూజ సెన్సాఫ్ హ్యూమర్ అదిరింది అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్ పై రణవీర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

Latest Articles