మాల్దీవులకే మంటలు పుట్టిస్తున్న బుట్టబొమ్మ..

సెలబ్రిటీస్.. నిత్యం షూటింగ్లతో బిజీ బిజీగా తిరుగుతుంటారు. ఇక కొద్దిగా సమయం దొరకగానే బ్యాగులు సర్దుకొని వెకేషన్ కి చెక్కేస్తారు. ఎంచక్కా అక్కడ చిల్ అవుతూ రిలాక్స్ అవుతారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే పని చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయినా పూజా కొద్దిగా సమయం దొరకగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను హద్దులు లేకుండా చూపించేస్తోంది. చాక్లెట్ కలర్ వన్ పీస్ బికినీలో పూజా మంటలు రేపుతోంది. బీచ్ లో వయ్యారి నడుమును ఓంపుగా తిప్పి మత్తెక్కించే చూపులతో మాల్దీవులకే మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే పూజా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అమ్మడు ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ తో పాటు విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Related Articles

Latest Articles