బుట్టబొమ్మకు మరింత పెరిగిన క్రేజ్… 15 మిలియన్ ఫాలోవర్స్

బుట్టబొమ్మ పూజాహెగ్డే మరో మైలురాయిని దాటేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. అందులో తన టీంను పరిచయం చేసింది. ఇందులో ఆమె హెయిర్‌ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ లతో ఫన్ వీడియోను రిలీజ్ చేసింది. ఇన్స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి సహాయం చేసినందుకు పూజ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!

ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్లు దాటిన సందర్భంగా “డిజె తర్వాత ఇప్పటి వరకు నాతో ఉన్న నా క్రేజీ టీమ్‌కి పరిచయం చేయాలనుకుంటున్నాను. వారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నన్ను నవ్విస్తారు, నా జబ్బుపడిన రోజులలో కూడా నేను అద్భుతంగా కనిపించేలా చేస్తారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఇదిగో టీమ్ పూజా హెగ్డే. నా అభిమానులను మీరు ప్రేమించండి” అంటూ పోస్ట్ చేసింది.

పూజ, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌” సెప్టెంబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. చెన్నైలో విజయ్ “బీస్ట్” తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఆమె ఇటీవల తిరిగి ముంబైకి వెళ్లింది. పూజ… రామ్ చరణ్, చిరంజీవి, కాజల్ అగర్వాల్ లతో “ఆచార్య”లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ తో ఆమె “సర్కస్‌”లో కూడా కనిపించబోతోంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Related Articles

Latest Articles

-Advertisement-